Wednesday, May 18, 2011


మన సైట్‌ని ఎవరెవరు విజిట్ చేస్తున్నారు?

మీకు ఒక వెబ్ సైట్ ఉందనుకుందాం. దానిని నెట్‌పై ఎవరెవరు యూజర్లు విజిట్
చేస్తున్నారు. మీ సైట్‌లోని ఏయే లింకులు ఎక్కువగా క్లిక్ చేయబడుతున్నాయి. ఏయే సెర్చ్
ఇంజిన్‌ల ఆధారంగా మీ సైట్‌ని విజిట్ చేస్తున్నారు, ఏ వెబ్ బ్రౌజర్ ద్వారా మీ సైట్ విజిట్
చెయ్యబడుతోంది. తదితర వివరాలను అందించే సాప్ట్ వేర్ OpenWebScope. ఇది అపరిమిత
పరిమాణంలో log ఫైళ్ళని క్రియేట్ చేస్తుంది. HTML రిపోర్ట్ టెంప్లేట్లని అందిస్తుంది. ఒకే
సమయంలో వేలకొద్ది సైట్లని విశ్లేషించగలుగుతుంది. దీన్ని
http://openwebscope.com సైట్ నుండి పొందవచ్చు.

0 వ్యాఖ్యలు: